తుంగతుర్తి, జూలై 6: కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లను ఆన్‌చేసి తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగానికి ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో సోమవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి తుంగతుర్తి రైతాంగాన్ని సాగు నీటిని అందించి ఆదుకోవాలని కోరారు. యూరియా యాప్‌ను రద్దు చేయాలని, రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.