Road Accident | సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌల్తాబాద్ మండలం చెట్లనర్సంపల్లి వద్ద జరిగిన శనివారం జరిగిన ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతి చెందారు. రోడ్డు దాటుతుండగా బైక్ను లారీ ఢీక్టొటింది. ఈ ఘటనలో తిరుమలాపూర్కు చెందిన తండ్రి వేణు, కొడుకు శివ (14) మృతి చెందారు. ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.