Road Accident | కర్ణాటకలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జోగులాంబ గద్వాలకు చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. విజయపుర జిల్లా మనుగులి సమీపంలో తెల్లవారు జామున 5 గంటల సమయంలో కారును ప్రైవేటు ట్రావెల్ బస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామానికి చెందిన టీ భాస్కర్, ఆయన భార్య పవిత్ర, అభిరామ్, జ్యోత్స్నతో పాటు కారు డ్రైవర్ శివప్పతో పాటు బస్ డ్రైవర్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. భాస్కర్ పదేళ్ల కొడుకు ప్రవీణ్ తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భాస్కర్ పట్టణంలోని కెనరా బ్యాంకులో పని చేస్తున్నారు. కుటుంబంతో కలిసి గద్వాలలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్నాడు.