నిర్మల్: నిర్మల్ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో (Accident) ఇద్దరు మధ్యప్రదేశ్ వాసులు మృతిచెందారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పలువురు కారులో శ్రీశైలం వెళ్తున్నారు. ఈ క్రమంలో నిర్మల్ జిల్లా మావడ మండలం బూర్గుపల్లి వద్ద జాతీయ రహదారిపై వారి కారుకు ఓ కోతి అడ్డువచ్చింది. దీంతో డ్రైవర్ దానిని తప్పించబోయాడు. అదుపు తప్పిన కారు బోల్తా కొట్టింది.
దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నిర్మల్ జిల్లా దవాఖానకు తరలించారు. కోతిని తప్పించబోయి ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితులంతా మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందినవారని, శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.