TS PCCF | తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారిగా (PCCF And HOFF) రాకేశ్ మోహన్ డోబ్రియాల్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పని చేసిన పీసీసీఎఫ్ పదవీ విరమణ చేయడంతో డోబ్రియాల్కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. తాజాగా ఆయనకు పూర్తిస్థాయిలో పీసీసీఎఫ్గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో అరణ్య భవన్లో ఆర్ఎం డోబ్రియాల్ బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా, హరిత తెలంగాణ సాధనకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది పని చేస్తామన్నారు.