మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 27, 2020 , 19:36:33

గోదావ‌రికి భారీగా పొటెత్తిన వ‌ర‌ద‌ ప్ర‌వాహాలు

గోదావ‌రికి భారీగా పొటెత్తిన వ‌ర‌ద‌ ప్ర‌వాహాలు

నిజామాబాద్ : గోదావ‌రి న‌దికి ఆదివారం వ‌ర‌ద ప్ర‌వాహాలు పోటెత్తాయి. మ‌హారాష్ర్ట నుంచి దాదాపు ల‌క్ష క్యూసెక్కుల నీరు అదేవిధంగా ప‌రివాహ‌క ప్రాంతాలైన గ‌డ్డెన్న‌వాగు, మంజీరా న‌ది నుంచి మ‌రో 65 వేల క్యూసెక్కుల వ‌ర‌ద ప్ర‌వాహాలు న‌దికి పోటెత్తిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ ప్రవాహల కార‌ణంగా కందకుర్తి వద్ద గ‌ల‌ పురాతన శివాలయం వరదనీటిలో మునిగిపోయింద‌న్నారు. నీటి మట్టం దాదాపు కందకుర్తి అంతర్ రాష్ట్ర వంతెనను తాకిన‌ట్లు వెల్ల‌డించారు. ఇదిలా ఉండగా ఎస్‌ఆర్‌ఎస్‌పికి ఆదివారం 1,64,922 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండ‌గా 40 వ‌ర‌ద గేట్ల‌ను ఎత్తి 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. దిగువ‌కు ప్ర‌వ‌హిస్తున్న నీరు సైతం వివిధ కాలువల ద్వారా విడుదల చేయ‌బ‌డుతుంది. 


logo