హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పొడి వాతావరణంతో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఆదిలాబాద్, కామారెడ్డి, కుమ్రంభీంఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 11 నుంచి 15 డిగ్రీలు, మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఫిబ్రవరి మొదటి వారంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా వేసవిలో వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు మొదలవగా, ఇవి మెల్లగా దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించే అవకాశమున్నట్టు చెబుతున్నారు.