ఖిలావరంగల్, నవంబర్ 10 : వరంగల్ జిల్లాలో రైస్ మిల్లర్లు సర్కార్ ఖజానాకు భారీ చిల్లు పెట్టారు. అధికార యంత్రాంగం అండ తో చెలరేగిపోయారు. ప్రభుత్వం నుంచి తీసుకునే సీఎంఆర్ తిరిగి అప్పగించే క్రమంలో రూ. కోట్లు దండుకున్నారు. కోటికిపైగా దోపిడీ జరిగినట్టు అధికారిక లెక్కలే చెప్తున్నాయి. కొందరు ప్రభుత్వ పెద్దల అండదండలకు తోడు అధికారుల అలసత్వం వల్ల రికవరీ చే యడం ప్రశ్నార్థకంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో 27 మంది రైస్ మిల్లర్లు ఏకంగా 32,083.23 టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని మాయం చేసినట్టు తెలిసింది. దీని విలువ రూ.131,57,24,918 ఉంటుంది. ప్రభుత్వానికి తిరిగి బియ్యం రూపంలో చెల్లించాల్సిన ఈ ధాన్యాన్ని మిల్లర్లు దొడ్డిదారిన ఇతర రాష్ర్టాలకు తరలించి సొమ్ము చేసుకున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారిక లెకల ప్రకా రం.. జిల్లాలోని 39 రైస్ మిల్లులకు ప్రభు త్వం 2023-24 వానకాలం, 2024-25 యాసంగికి సీఎంఆర్ కేటాయించింది. 12 మంది మిల్లర్లు ధాన్యం తీసుకున్నారు. 15 మంది మిల్లర్లు కేవలం వానకాలంలో ధాన్యం తీసుకున్నారు. మొత్తం 27 మంది మిల్లర్లు తమకు కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, బియ్యం రూపంలో తిరిగి పౌరసరఫరాల శాఖకు అప్పగించడంలో విఫలమయ్యారు. ఈ ధాన్యం విలువ దాదాపు రూ.131.57 కోట్లు ఉంటుందని అంచనా.
ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ ధాన్యం మాయంకావడం, ఆ తర్వాత దానిని రికవరీ చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. మిల్లర్లకు ధాన్యాన్ని కేటాయించిన తరువాత, నిర్ణీత గడువులోగా బియ్యం తిరిగి అప్పగిస్తున్నారా? లేదా అని పర్యవేక్షించడంలో పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించారనే విమర్శలు ఉన్నాయి. ధాన్యం మాయమైనట్టు గుర్తించినా 27 మంది మిల్లర్ల నుంచి రూ.131 కోట్లకు పైగా విలువైన ధాన్యాన్ని లేదా దానికి సమానమైన బియ్యాన్ని తిరిగి రాబట్టడంలో అధికారులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు సర్వత్రా నెలకొన్నాయి. కొందరు రైస్ మిల్లర్లతో అధికారులు కుమ్మకై, వారి అక్రమాలకు పరోక్షంగా సహకరించారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లుల ద్వారా బియ్యంగా మార్చి, వాటిని పేదలకు పంపిణీ చేయడానికి ఉద్దేశించిన సీఎంఆర్ ప్రక్రియను కొందరు మిల్లర్లు కేవ లం అక్రమ సంపాదనకు మార్గంగా మార్చుకున్నారని స్పష్టమవుతున్నది. ప్రభుత్వ ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేయకుండా దానిని బహిరంగ మారెట్లో విక్రయించి, ఆ సొమ్మును వ్యక్తిగత అవసరాలు లేదా ఇతర వ్యాపారాలకు మళ్లించినట్టు సమాచారం.
రూ. కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైన ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, పూర్తిస్థాయి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది. కేవలం మిల్లర్లపైనే కాకుండా వారికి సహకరించినట్టు ఆరోపణలు ఎదురొంటున్న అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే మాయమైన రూ.131.57 కోట్ల ధాన్యాన్ని లేదా దాని విలువను తక్షణమే రికవరీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
39 మంది రైస్ మిల్లర్లను బ్లాక్ లిస్ట్‌లో చేర్చాం. ఇప్పటికే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయించాం. ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. డిఫాల్టర్ల ఆస్తులు గుర్తించాలని కలెక్టర్ నుంచి తహసీల్దార్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. త్వరలోనే ఆర్ఆర్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు.
మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గద్దెల వెనుక వైపున 186/1, 186, 185 సర్వే నంబర్లలో సుమారు 19.27 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిని ఆలయ అభివృద్ధికి ఇవ్వాలని కలెక్టర్‌తోపాటు అధికారులు ఆదివాసీలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. అయితే తమ భూమి ఇచ్చేది లేదని వారు తేల్చిచెప్పారు.

ఆ భూములు ఇచ్చినట్టు కొందరు అధికారులు వదంతులు సృష్టిస్తున్నారని, బలవంతంగా తమ భూములు లాక్కోవాలని చూస్తే తిరుగుబాటు తప్పదని రైతులతోపాటు సమ్మక్క దేవత పూజారులు సిద్ధబోయిన పాపారావు, జనార్దన్, సురేందర్, ఆనంద్, రమేశ్, క్రాంతీశ్వరి హెచ్చరించారు.