హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో కొనసాగిన ప్రగతి సమావేశం నుంచి పోలవరం ప్రాజెక్టు అంశాన్ని మరోసారి తొలగించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతి, ముంపు తదిత ర అంశాలపై సమీక్షించాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా వేశారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నా..
ప్రస్తుతం కేవలం 41.67 మీటర్ల ఎత్తులోనే నీటిని నిల్వ చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 5,277.84 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. తెలంగాణలోనూ 6 మండలాల్లో 954 ఎకరాలు ముంపునకు గురికానున్నాయి. ఛత్తీస్గఢ్, ఒడిశా సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.