హైదరాబాద్, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ): వానకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లపై సివిల్ సప్లయ్ మంగళవారం కీలక సమావేశాన్ని నిర్వహించనున్నది. ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహించే ఈ సమావేశానికి అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, సివిల్ సప్లయ్ జిల్లా అధికారులు హాజరుకానున్నారు. ఈ మేరకు ఈ సీజన్లో ఎంత ధాన్యం దిగుబడి వస్తుంది..?, ఇందులో ఎంతమేరకు కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంశాలపై చర్చించనున్నారు. అయితే సుమారు 80లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని అధికారులు అంచనా వేసినట్టుగా తెలిసింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం 52లక్షల మెట్రిక్ టన్నులకే అనుమతి ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మిగిలిన ధాన్యం కొనుగోలుపై ఏం చేయాలనే అంశంతోపాటు, సన్న ధాన్యం బోనస్‌పై చర్చింనున్నారు.