హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ కార్మికులను అత్యంత ఆందోళనకు గురిచేస్తున్న వర్షాప్ల తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రతినిధి బృందం మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విన్నవించింది. సోమవారం సచివాలయంలోని మంత్రిని కలిసి ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులను టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి వివరించారు.
ఎస్సీ గురుకులాల సెక్రటరీగా సీతాలక్ష్మి
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) సెక్రటరీగా కే సీతాలక్ష్మిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులను జారీచేశారు.