డెత్ సర్టిఫికెట్ కోసం లంచం.. రూ.2 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఎస్వో
డెత్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో రూ.2 వేలకు కక్కుర్తిపడి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ ఏఎస్వో. ఈ ఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వద్ద చోటుచేసుకున్నది.
భూపాలపల్లి రూరల్, ఫిబ్రవరి 21: డెత్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో రూ.2 వేలకు కక్కుర్తిపడి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ ఏఎస్వో. ఈ ఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వద్ద చోటుచేసుకున్నది. వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ కే సుదర్శన్ కథనం ప్రకారం.. రేగొండ మండలానికి చెంది న పోడేటి కాంతమ్మ నాలుగేండ్ల క్రితం మరణించింది. కాంతమ్మ కుమారుడు సుదర్శన్ తల్లి డెత్ సర్టిఫికెట్ కోసం గతేడాది డిసెంబర్లో ఆన్లైన్లో దరఖాస్తు చేశాడు.
ఇందుకోసం కాంతమ్మ అల్లుడు మల్లికార్జున్ రేగొండ రెవెన్యూ కార్యాలయంలో ఏఎస్వో (అసిస్టెంట్ స్టాటిస్టిక ల్ ఆఫీసర్)గా పనిచేస్తున్న మొగుళ్ల రఘుపతిని కలువగా.. రూ.2 వేలు లం చం డిమాండ్ చేశాడు. ఎన్నిసార్లు కలిసినా ఇలాగే చెప్తుండటంతో మల్లికార్జున్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులు వలపన్ని.. కలెక్టరేట్ గేటు ఎదుట ఏఎస్వో రూ.2 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. రఘుపతిని జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

