రాయికల్, జూలై 30: ‘రేవంత్పాలన ఏం మంచిగలేదు. కేసీఆర్ పాలననే మంచిగుండే. మళ్లీ కేసీఆర్ వస్తేనే అందరికీ మేలైతది బిడ్డా’ అంటూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్కు చెందిన 70 ఏండ్ల వృద్ధురాలు పంతెంగి మల్లవ్వ బుధవారం జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో పేర్కొన్నది. అల్లీపూర్కు చెందిన పంతెంగి లక్ష్మి కొన్నిరోజుల క్రితం అనారోగ్యంతో దవాఖానలో చికిత్స తీసుకున్నది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారంతో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా.. సాయం మంజూరైంది.
బుధవారం దావ వసంత చెక్కును పట్టుకొని లక్ష్మి ఇంటికి వెళ్లగా ఆమె అందుబాటులో లేకపోవడంతో ఆమె అత్త మల్లవ్వకు అందజేశారు. ఈ సందర్భంగా మల్లవ్వ.. దావ వసంత వద్దకు వచ్చి ‘రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరూ సంతోషంగా లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ఇంకోసారి కాంగ్రెస్కు ఓటు వెయ్యం. మళ్లీ కేసీఆరే రావాలి బిడ్డా’ అని తన మనసులో మాటను తెలిపింది.