హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై రేవంత్ వ్యాఖ్యలకు సభ్యసమాజం సిగ్గు పడుతున్నదని గ్లోబల్ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల శనివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణను సాధించి, రెండు సార్లు ప్రజలతో ముఖ్య మంత్రిగా ఎన్నికైన కేసీఆర్‌పై పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విశ్వవ్యాప్తంగా తెలంగాణ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్న ఎన్ఆర్ఐలను ఉద్దేశించి అవమానించేలా మాట్లాడడం సరికాదన్నారు. దేశం కోసం చెమటోడ్చి న ప్రతి తెలంగాణ బిడ్డ గౌరవమే మన గౌరవమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. దూరదృష్టితో పరిశ్రమలు తెచ్చి తెలంగాణ ఖ్యాతిని పెంచిన కేటీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి తూలనాడటం బాధాకరమని పేర్కొన్నారు.