హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 72వసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ముంబైకి బయలుదేరనున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అక్కడి నుంచి సా యంత్రం హస్తినకు వెళ్లనున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకోనున్న సీఎం.. సోమవారం, మంగళవారంలో హ స్తినలోనే ఉండనున్నట్టు సమాచారం. ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులను కలువనున్నారు.
అశ్వినీ వైష్ణవ్‌తో భేటీకి ఏర్పాటు చేయండి
మెట్రో రైలు పెండింగ్ అంశాల పరిష్కారానికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటుచేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం కిషన్‌రెడ్డికి ముఖ్యమంత్రి లేఖ రాశారు.