హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌డ్డి ఉన్న పళంగా ఢిల్లీకి పయనమయ్యారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. సీఎం హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లడం కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో చర్చనీయాంశమైంది. ఢిల్లీ చేరుకున్న సీఎం.. బుధవారం రాత్రి వరకు తన నివాసంలోనే ఉన్నట్టు తెలిసింది. గురువారం (నేడు) ఉదయం అధిష్ఠానం పెద్దలతో భేటీ అవుతారని తెలిసింది. రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌పై అధిష్ఠానానికి వివరించే అవకాశం ఉన్నదని సమాచారం. దీంతోపాటు పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరినట్టు తెలిసింది. ఇక సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లడం ఇది 60వసారి కావడం గమనార్హం.