హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మళ్లీ ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీతో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హస్తినకు వెళ్లారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లడం ఇది 61వ సారి.
ఓటు చోరీకి వ్యతిరేకంగా ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం వద్ద నిర్వహించే మహా ర్యాలీలో కాంగ్రెస్ నాయకులతో కలిసి రేవంత్‌రెడ్డి పాల్గొంటారు. మెస్సీ కార్యక్రమానికి హాజరుకావాలని రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీని ఆహ్వానించేందుకు రేవంత్‌రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.