హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దాదాపు నెల రోజుల తర్వాత సచివాలయానికి వచ్చారు. ఆయన చివరగా గత నెల 28న సచివాలయానికి వచ్చారని అధికార వర్గాలు తెలిపాయి. ఆ రోజు ఇం దిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పటివరకు మళ్లీ సచివాల యం వైపు కన్నెత్తి చూడలేదని పేర్కొన్నాయి.
జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నుంచే పాలన కొనసాగిస్తున్నారని, స మీక్ష పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంట ర్ నుంచి నిర్వహిస్తున్నారని తెలిపాయి. అధికారంలోకి వచ్చిన కొత్తలో రోజూ సచివాలయానికి వచ్చిన సీఎం.. కొన్ని నెలలుగా ఎప్పుడో ఒకసారి చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారు. గతంలో కేసీఆర్‌ను పదేపదే విమర్శించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు అదే పని ఎందుకు చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
పాలనపరంగా ప్రభుత్వపై ప్రజల్లో వ్యతిరేకత రావడం, అసమర్థ విధానాలపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో స చివాలయానికి వాస్తు మార్పులు చే యాలని నిర్ణయించారు. ఈ మేరకు రెండు మూడు దశల్లో ఇప్పటివరకు వాస్తు మార్పులు జరిగాయి. సీఎం చాంబర్లో మార్పులు చేసినా, వచ్చి పోయే మార్గాలు మార్చుకున్నా, సచివాలయం ముందు గేట్లు తొలగించినా, కొత్తగా రోడ్లు వేసుకున్నా పెద్దగా మార్పు కనిపించడం లేదని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే సచివాలయానికి రాకుండా ఇంటి నుంచి పాలన కొనసాగిస్తున్నారన్న చర్చ జరుగుతున్నది.