హైదరాబాద్, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): కలలు ఎన్నైనా కనొచ్చు, అద్భుతాలె న్నో ఊహించుకోవచ్చు.. గానీ మెలుకువ రాగానే వాస్తవం సాక్షాత్కరిస్తుంది, అన్నీ తొలగిపోతాయి. ప్రస్తుతం రాష్ట్ర సర్కారు విజన్ పేరుతో వ్యవహరిస్తున్న తీరు కూడా కలల్లో విహరిస్తున్నట్టే అనిపిస్తున్నది. విజన్ డాక్యుమెంట్ పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన పత్రంలో గేమ్‌చేంజర్‌గా చెప్పుకున్న 13 ప్రాజెక్టుల్లో తొమ్మిదింటి అంచనా వ్యయమే రూ.ఆరున్నర లక్షల కోట్లుపై మాటే ఉన్నా ఇట్టే చేసేస్తాం.. అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరే హాస్యాస్పదం. పైగా వాటికి కేంద్ర సర్కారు సాయం అందిస్తున్నట్టు, ఆర్థిక సంస్థలు భారీగా రుణాలు ఇచ్చేందుకు క్యూకట్టినట్టు ఇస్తున్న ప్రభుత్వ బిల్డప్ నవ్వు తెప్పిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంటు పేరు తో కొంతకాలంగా హడావుడి చేస్తున్న విష యం తెలిసిందే. ఇందులో భాగంగా పలు ప్రణాళికలు రూపొందించి ఇవి రాష్ట్రంలో గేమ్‌చేంజర్‌గా మారుతాయని ప్రకటించింది. భవిష్యత్తుపై సరియైన అంచనాలులేక నేడు దేశంలోని మహానగరాలన్నీ మౌలిక సదుపాయాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయని, దాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుచూపుతో గేమ్‌చేంజర్ ప్రాజెక్టులకు రూపకల్పన చేసినట్లు పేర్కొంటున్నది.
భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, డ్రైపోర్ట్ నిర్మాణం, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి కృష్ణపట్నం పోర్టుకు 12 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే, హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నయ్‌కు బుల్లెట్ రైల్ కారిడార్, ఓఆర్ఆర్-ట్రిపుల్ ఆర్ మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ల ఏర్పాటు, రీజినల్ రింగురోడ్, ఓఆర్ఆర్-ట్రిపుల్ ఆర్ మధ్య రేడియల్ రోడ్లు, రీజినల్ రైలు రింగు, వ్యవసాయ క్షేత్రాలకు గ్రీన్ పవర్, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ల ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ హబ్‌లు, భారీగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం తదితర ప్రాజెక్టులున్నాయి. వాటిని పూర్తిచేయాలంటే ఆరున్నర లక్షల కోట్లు అవసరమవుతాయి.
ఇప్పటికే రాష్ట్రసర్కార్ పలు ప్రాజెక్టులపై వినతులు చేసినా ఉలుకుపలుకు లేదు. 2017లో మంజూరైన రీజినల్ రింగురోడ్డే అందుకు ఉదాహరణ. టెండర్లు పిలిచినా ఉత్తర భాగం రోడ్డు పనులకు భూసేకరణ పూర్తికాలేదు, దక్షిణ భాగం పనులకు సేకర ణే మొదలుకాలేదు. అలాంటిది గేమ్‌చేంజర్ లాంటి భారీ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు, నిధులు లేకుంటే ఎలా ముందుకెళ్తారనే అనుమానాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితేమో రోడ్డుకాదు కదా కనీసం గుంతలు కూడా పూడ్చలేని దుస్థితి. అలాంటిది కేంద్రం సహాయంతోపాటు ఆర్థిక సంస్థలనుంచి నిధులు సమీకరించి పూర్తి చేయాల్సి ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశాలు అస్సలు కనిపించడమే లేదు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా తయారైంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే రాష్ట్రం దివాలా తీసిందని పదేపదే ప్రచారం చేస్తుండడంతో ఆర్థిక సంస్థలు కూడా నిధులిచ్చేందుకు ఆలోచిస్తున్నాయి. భూముల విక్రయించడంతో నెట్టుకొస్తున్న ప్రస్తుత పరిస్థితు ల్లో ఆరున్నర లక్షల కోట్ల ప్రాజెక్టులు అంతరాయం లేకుండా తీసుకెళ్లడం సాధ్యమయ్యే నా అని అధికారవర్గాలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపాదిత ప్రాజెక్టులతో రాష్ట్రం గేమ్‌చేంజర్‌గా మారుతుందనడంతో సందే హం లేదుగానీ, కార్యరూపం దాల్చే అవకాశా లే మృగ్యం. కేంద్రం నిధులివ్వకపోయినా ఇతరుల సహకారంతోనైనా నెట్టుకురావొచ్చని భావించినా అదీ ముందుకెళ్లేది కష్టమే.
