హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తయారుచేసిన రత్నాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు అని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజుయాదవ్ పేర్కొన్నారు. వారిద్దరూ తెలంగాణ పోరాటయోధులు అని, కానీ సీఎం రేవంత్ తెలంగాణ ద్రోహి అని ధ్వజమెత్తారు. తెలంగాణ భ వన్‌లో మంగళవారం మీడియా సమావేశం లో బీఆర్ఎస్ నేతలు వాసుదేవరెడ్డి, చిరుమళ్ల రాకేశ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, పల్లె రవికుమార్, రామచంద్రునాయక్తో కలిసి ఆయన మాట్లాడారు.
స్కామ్‌పై మౌనం ఎందుకు సంజయ్? : గెల్లు
బొగ్గు స్కామ్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ మౌనం వహించడం దేనికి సంకేతమని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యారనేందుకు ఇది నిదర్శనం కాదా? అని మండిపడ్డారు.
హామీలపై దృష్టిపెట్టాలి : వాసుదేవరెడ్డి
డైవర్షన్ పాలిటిక్స్ బంద్‌పెట్టి, హామీల అ మలుపై దృష్టిపెట్టాలని బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావును నాలుక కోస్తామని కాంగ్రెస్‌లోని చిన్న దండుపాళ్యం ప్రగల్భాలు పలుకుతోంద ని, పిచ్చిమాటలు మాట్లాడితే ప్రజలే కాంగ్రెస్ నేతల నాలుకలు కోస్తారని హెచ్చరించారు.
కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు : రాకేశ్
కాంగ్రెస్ నేతలు చేసిన కుంభకోణాలు వెలికితీస్తున్నందుకే తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని బీఆర్ఎస్ నేత చిరుమళ్ల రాకేశ్కుమా ర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు అని విమర్శించారు. మంత్రుల పంచాయితీలను పక్కదారి పట్టించేందుకే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
డైవర్షన్ పాలిటిక్స్ సిగ్గుచేటు: ఎర్రోళ్ల
ప్రతిపక్షంగా తాము అడిగిన ప్రశ్నలకు స మాధానం చెప్పలేని దద్దమ్మ సరార్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం సిగ్గుచేటని కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రకటనలో విమర్శించారు. బొగ్గు సాంలో బామ్మర్ది సహా రేవంత్ బండారం బయటపెట్టే సరికి నోట మాటరాక సిట్ పేరిట పోలీసులను ఉసిగొల్పారని మండిపడ్డారు. ఎన్ని డ్రామాలు చేసినా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదు: మన్నె
ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కమిషన్లు, సిట్ లు వేసినా భయపడబోమని, వెనుకడుగు వే సే ప్రసక్తేలేదని బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధర్రెడ్డి ప్రకట నలో స్పష్టంచేశారు. కేసులు పెడితే రేవంత్‌రెడ్డి ద్రో హాలను బయటపెట్టకుండా ఉండబోమని స్పష్టంచేశారు. కుట్రలను ఛేదించి కొట్లాడి తెలంగాణ సాధించినోళ్లమని తెలిపారు.
ప్రశ్నిస్తే అక్రమ కేసులా : గాంధీనాయక్
ప్రజల తరఫున ప్రశ్నించే వారిపై కాంగ్రెస్ సర్కార్ అక్రమ కేసులు పెడుతున్నదని టీఎస్జీసీసీ మాజీ చైర్మన్ అభిమాన్ గాంధీనాయక్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకత్వాన్ని అణచివేయాలనే కుట్రతో మాజీ మంత్రి హరీశ్‌రావుకు రేవంత్ సర్కార్ సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచిందని పేర్కొన్నారు.