CM Revanth Reddy | హైదరాబాద్, మార్చి 2 (నమస్తేతెలంగా ణ): రాష్ట్రంలోని 35 వేల అంగన్వాడీ కేంద్రా ల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని, అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అంగన్వా డీ కేంద్రాల్లో చిన్నారులతోపాటు గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్ఠికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం సచివాలయంలో స్త్రీ శిశు, ది వ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఆడిటింగ్‌కు వీలుండేలా అన్ని రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచాలని చెప్పారు. పౌష్ఠికాహార లోపం, రక్తహీనతతో రాష్ట్రంలోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు అనారో గ్యం పాలవుతున్నట్టు ఎన్హెచ్ఎఫ్ఎస్ వెల్లడించిన గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పారు.
జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులతో శానిటరీ న్యాపిన్స్ తయా రు చేయించాలని, అందుకు అవసరమైన యూ నిట్లు నెలకొల్పాలని ఆదేశించారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 12,315 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించే ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని, బోధన దవాఖానలు అన్నింట్లో ట్రాన్స్జెండర్లకు వైద్య చికిత్సలు అందించాలని పేర్కొన్నారు. స మావేశంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక, సీఎస్ శాంతికుమారి, ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, మాతా శిశు సంక్షేమ విభాగం డైరెక్టర్ క్రాంతి వెస్లీ, వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ విభాగం డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.