హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కారు ఈవారం మరో రూ.1,000 కోట్ల రుణం పొందింది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మంగళవారం నిర్వహించిన ఈ వేలంలో పాల్గొని రాష్ట్ర ఆర్థికశాఖ ఈ మొత్తాన్ని సేకరించింది. సెక్యూరిటీ బాండు ద్వారా 35 ఏండ్ల కాలానికి 7.33శాతం వార్షిక వడ్డీతో రూ.1,000 కోట్లు తీసుకున్నట్టు ఆర్బీఐ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.17,400 కోట్లు అప్పు తీసుకున్నది. రెండో త్రైమాసికంలో రూ. 12,000 కోట్లు రుణం తీసుకుంటామని ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపిన కాంగ్రెస్ ప్రభుత్వం జూలైలో రూ.8,500 కోట్లు, ఆగస్టు 5న రూ.5,000 కోట్లు, 12న రూ.1,000 కోట్లు సేకరించింది.