Bakka Judson | ఖైరతాబాద్, మే 8: సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎం అనుచరుడు ఫయీమ్ ఖురేషీ కలిసి ఖజానాకు వేల కోట్ల రూపాయలు గండి కొడుతున్నారని కాంగ్రె స్ మాజీ నాయకుడు బక్కా జడ్సన్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం మీడియా సమావేశంలో జడ్సన్ మాట్లాడు తూ రాష్ట్ర వ్యాప్తం గా కమీషన్లు ఇచ్చే యాడ్ ఏజెన్సీలకే టెండర్లు లేకుండానే హోర్డింగ్‌ల బాధ్యతలు కట్టబెడుతున్నారని చెప్పారు.
శంషాబాద్‌లో ఏడాదికి రూ.12కోట్లు ప్రభుత్వానికి కట్టాల్సి ఉండ గా, కేవలం రూ.63 లక్షలు కట్టిన ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఇలా రాష్ట్రం మొత్తం కలిపి వేలకోట్ల దోపిడీ జరుగుతున్నదని చెప్పారు. రాష్ట్రం దివాలా తీసిందన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణకు పెట్టుబడులు రాకుండా, ఏపీకి తరలిపోయేలా రేవంత్ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.