హైదరాబాద్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): చెప్పేందుకే నీతులు అన్నట్టుగా ఉన్నది సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ సర్కార్ తీరు ఉన్నది. స్పీకర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఏదో అన్నారంటూ నానా రాద్ధాంతం చేస్తున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు.. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి చేసిన అవమానంపై మాత్రం నోరు మెదపడంలేదనే విమర్శలొస్తున్నాయి.
అసెంబ్లీలో సెంట్రల్‌హాల్ ప్రారంభోత్సవం రోజు స్పీకర్, చైర్మన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం పలుకాలి. కానీ, ఇందుకు విరుద్ధంగా సీఎం రేవంత్‌రెడ్డి కోసం స్పీకర్ గడ్డం ప్రసాద్, చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వేచిచూశారు. సెంట్రల్‌హాల్ ప్రారంభోత్సవానికి ఉదయం 9 గంటలకు ముహూర్తం ఖరారు చేయగా, ముందుగా స్పీకర్, చైర్మన్ వచ్చారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఆలస్యంగా వచ్చారు. దీంతో చాలాసేపు సీఎం కోసం వారు వేచిచూశారు.