అత్యంత అబద్ధాల సీఎం రేవంత్‌రెడ్డే.. ఎంపీ ఆర్ కృష్ణయ్య
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఒక సమావేశంలో ఫీజు బకాయిలు రూ.2,300 కోట్లు అడ్వాన్స్‌గా బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని ప్రకటించారని, ఏ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారో, విద్యార్థులకు ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని బీసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి అబద్ధాలు చెప్పడం తన రాజకీయ జీవితంలో రేవంత్‌రెడ్డినే చూశానని పేర్కొన్నారు.
- ఫీజు బకాయి 2,300 కోట్ల అడ్వాన్స్
- ఏబ్యాంకులో పెట్టారో సీఎం చెప్పాలి
- రాష్ట్రవ్యాప్తంగా 25న కలెక్టరేట్లు, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల ముట్టడి : ఎంపీ ఆర్ కృష్ణయ్య
రవీంద్రభారతి, ఆగస్టు 20 : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఒక సమావేశంలో ఫీజు బకాయిలు రూ.2,300 కోట్లు అడ్వాన్స్‌గా బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని ప్రకటించారని, ఏ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారో, విద్యార్థులకు ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని బీసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి అబద్ధాలు చెప్పడం తన రాజకీయ జీవితంలో రేవంత్‌రెడ్డినే చూశానని పేర్కొన్నారు. గురువారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో బీసీ నేతలు జిల్లపల్లి అంజి, నీలా వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి వచ్చిన ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌కు బడ్జెట్ ఇవ్వకుండా సీఎం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో వివిధ కాలేజీల్లో 4 లక్షల మంది విద్యార్థుల కోర్సులు పూర్తయ్యాయని, యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో పైచదువులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం దిగొచ్చేవరకూ ఫీజు ఉద్యమాన్ని ఆపేదిలేదని స్పష్టంచేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటా రూ.2వేల కోట్ల ఫీజులు చెల్లించి విద్యార్థులను పైచదువులకు పంపించారని, విదేశీ విద్య కోసం రూ.25 లక్షలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. రూ.9వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించనున్నట్టు తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

