Revath Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాష్ట్రాన్ని పాలించడం చేతగాదని ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి భర్త ఆగ్రహం వ్యక్తంచేశారు. తన భార్య ప్రభుత్వ పాఠశాలలో హెడ్మాస్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యిందని, ఈ ప్రభుత్వం తమకు రూ.1 కోటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ బాకీ ఉందని ఆయన చెప్పారు. తన భార్యతోపాటు చాలామంది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతనే రిటైర్ అయ్యారని, వాళ్లకు బెనిఫిట్స్ వీళ్లు ఇవ్వకుండా కేసీఆర్‌ను ఎలా బాధ్యుడిని చేస్తారని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేయడం రావడంలేదని ఆయన మండిపడ్డారు. ఇంకో ఐదేళ్లు కాదని, ఇప్పుడు ఎన్నికలు పెట్టినా రేవంత్ రెడ్డి ఓడిపోతాడని అన్నారు. వీళ్లు ప్రభుత్వ సొమ్మును దుబారా ఖర్చులకు వాడుతున్నారని, వీళ్లకు ఒక్క రూపాయి కూడా సంపాదించడం రావడంలేదని విమర్శించారు. ప్రజాపాలన అన్నారని, తాము అసెంబ్లీకి బాధ చెప్పుకునేందుకు వెళ్తే అరెస్టు చేశారని ఆరోపించారు.
సీఎం రేవంత్‌రెడ్డికి అనుభవం లేక తెలంగాణను దిగజారుస్తున్నడని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి రెట్టింపు అయ్యిందని అన్నారు.