KTR | ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి వెళ్లాం. చట్టసభల్లో చర్చలు జరగాలి లేదా నిరసనలు తెలపాలి. రాహుల్ గాంధీ తరహానే మేం కూడా సభలో నిరసన తెలపాలి.. ముఖ్యమంత్రి మాట్లాడినట్టు మేమేం అనలేదు.. నికృష్ణమైన భాషలో మాట్లాడలేదు. అన్‌పార్లమెంటరీ పదాలు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 100 రోజులన్నారు.. 1000 రోజుల మీ నిష్పల పరిపాలన.. ఏంటీ ఎందుకు హామీలు అమలు చేయలేదని ప్రశ్నిస్తూ ఇవాళ శాసనసభలో అడుగుపెట్టేందుకు మేమంతా ముందుకు పోయినం. ఆశ్చర్యకరమైన విషయమేమంటే మా అక్కలు ముగ్గురు శాసనసభ్యురాళ్లు, సీనియర్ నాయకులు గతంలో మంత్రులుగా పనిచేసినవాళ్లు.. జిల్లా పరిషత్ చైర్మన్‌గా కూడా కోవ లక్ష్మి పనిచేశారు. సహాయ మంత్రి స్థాయిలో పనిచేశారు.. అపారమైన అనుభవం, అపారమైన సామాజిక స్కృహ, రాజకీయంలో ఎత్తుపల్లాలు, జీవితంలో ఎత్తుపల్లాలు ఎన్నో చూసిన అనుభవజ్ఞులు వాళ్లు.. వాళ్లు నిజానికి సబితాఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి రాజకీయ ప్రస్థానం చూస్తే వారిని అజాత శత్రువులుగా గుర్తిస్తారు.. ఇద్దరూ కూడా చాలా చాలా సౌమ్యంగా మాట్లాడే మృదుబాషులు. అట్లాంటి మా ఇద్దరు ఆడబిడ్డలను ఈ రోజు ఈ ముఖ్యమంత్రి ఆయన పోలీసు బలగం ఎంత దుర్మార్గంగా ఎంత కిరాతకంగా వ్యవహారం చేసిందో మొత్తం రాష్ట్రం చూసింది.. మొత్తం దేశం చూసిందన్నారు..
అప్పటికే ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకురాళ్లు..
ఒకవైపు రాహుల్ గాంధేమో మహిళల గౌరవాన్ని, స్వాతంత్య్రాన్ని, సాధికారతను పెంచే దిశగా (smash the patriarchy) స్మాష్ ద పాట్రియార్కి అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. అయ్యా రాహుల్ గాంధీ నువ్వు రాజకీయాల్లోకి అడుగుపెట్టక ముందు అక్కలు మంత్రులు.. మీరు రాజకీయాల్లో మొట్టమొదటి సారి మీరు ఎంపీ కాకముందే మా సోదరీమణులిద్దరూ మంత్రులుగా పనిచేసిన సీనియర్ నాయకురాళ్లు, రాజకీయాల్లో అప్పటికే ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకురాళ్లు.. కానీ ఇవాళ వారి పట్ల మీ పోలీసులు ప్రవర్తించిన పద్దతి… గత 25 ఏండ్లుగా ఓటమి ఎరుగని నాయకురాలు అట్లాంటి నాయకురాలు పట్ల జుట్టు పట్టుకొని ఒక మగ పోలీసు ఆమె గొంగు పిసికే ప్రయత్నం చేశారు. ఇది మొత్తం రాష్ట్రం చూసింది. దీనికి బాధ్యుడు, దీని వెనకాల ఉన్నది స్పష్టంగా రేవంత్ రెడ్డి తప్ప ఇంకెవరినో కాదు.. మేమెవరినీ నిందించడం లేదన్నారు.
గతంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రిగా ఆనాడు పెద్దలు వైఎస్ఆర్, కిరణకుమార్ రెడ్డి నాయకత్వంలో సమర్థవంతంగా పనిచేసిన నాయకురాలు.. వారి పట్ల పోలీసులు వ్యవహారం చేసిన తీరు.. కొద్దిగా అయితే నిజానికి అక్కడ మా కోవ లక్ష్మి లేకపోతే మా సునీతా లక్ష్మారెడ్డి అక్కడ ఇనుప కంచె గ్రిల్స్ మీద పడే పరిస్థితి. ఇవాళ ఆమెకేమన్నా అయి ఉంటే ఏం జరిగి ఉండేదో నాకు తెలియదు కానీ.. ఇంత దారుణంగా చీర పట్టి లాగి.. ఇది శాసన సభ కాదు దుశ్శాన సభ అన్నట్టుగా ఇవాళ వ్యవహరించి చివరకు మా సునీతా లక్ష్మారెడ్డి కండ్ల వెంబడి కంటనీరు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.
LIVE: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మీడియా సమావేశంhttps://t.co/fijbUboqW7
— BRS Party (@BRSparty) September 7, 2026
ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలి : డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్