హైదరాబాద్ : ప్రభుత్వం రైతులను నిండా ముంచుతొంది. రైతుల పాలిట శనిలా దాపురిం చారు. రైతులను రేవంత్ రెడ్డి ( Revanth ) అన్ని విధాలా ఇబ్బందులు పెడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు రెడ్కో మాజీ చైర్మన్ వై. సతీష్ రెడ్డి ( Y. Satish Reddy ) ఆరోపించారు. ఇప్పటి వరకు పండించిన పంట కొనక రైతులను అరిగోస పెడుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బీమాకు ఎగనామం పెట్టిందని, ఎల్ఐసీకి చెల్లించాల్సిన ప్రీమియం డబ్బులు ఇప్పటివరకు చెల్లించలేదని దుయ్యబట్టారు. దాదాపు రూ. 441 కోట్లకు ప్రీమియం కింద చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని ఆరోపిం చారు. ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన దాదాపు 7,606 మందికి పైగా రైతుల కుటుంబాల పరిస్థితి ప్రభుత్వ తీరు వల్ల అగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నా కూడా రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడటం లేదని అన్నారు. పంట చేతికి రాకపోయినా బీమా డబ్బులు అయినా వస్తాయనే భరోసా ఉండేది. రేవత్ సర్కారు తీరుతో అది కూడా లేకుండా పోయిందని పేర్కొన్నారు. అప్పుడే ఎరువులకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. యూరియా కోసం ఫర్టిలైజర్ షాపుల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులు ఏడుస్తూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాడిస్టిక్ ప్లెజర్ పొందుతున్నట్టుగా కనిపిస్తోందని విమర్శించారు.