రంగారెడ్డి, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల కేంద్రంగా కొనసాగుతున్న ఫ్యూచర్ సిటీ పనులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం పరిశీలించారు. సాయంత్రం 4 గంటలకు ఫ్యూచర్ సిటీకి చేరుకున్న ఆయన, 5 గంటల వరకు వివిధ పనుల పురోగతిని పరిశీలించారు.
ఫ్యూచర్ సిటీలో నిర్మాణం చేపట్టిన పరిపాలనా భవనం, స్కిల్ డెవలప్మెంట్, రోడ్ల పనులను అడిగి తెలుసుకున్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి చేపట్టబోయే పనులను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకు వివరించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ పరిపాలనా భవనాన్ని త్వరగా పూర్తిచేసి ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు.