హైదరాబాద్, జూలై 24(నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టుకతో ఓబీసీ కాదని, ఆయన చట్టబద్ధంగా కన్వర్ట్ అయిన ఓబీసీ అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాబట్టి ఆయన ఓబీసీల కోసం చిత్తశుద్ధిగా ఏదీ చేయబోరని అన్నారు.
గురువారం ఢిల్లీలో తెలంగాణలో చేపట్టిన కులగణనపై అన్ని రాష్ర్టాల కాంగ్రెస్ ఎంపీలకు రాష్ట్ర కాంగ్రెస్ తరుఫున డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పూర్తి పారదర్శకంగా కులగణన చేసినట్టు తెలిపారు. ఇది దేశానికే రోల్‌మాడల్‌గా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీని సీఎం పొగడ్తలతో ముంచెత్తారు. తాను మొదటి నుంచి కాంగ్రెస్‌లో లేకపోయినా రాహుల్‌గాంధీ ఆత్మతో కలిసిపోయానని పేర్కొన్నారు.