ప్రభుత్వ పాఠశాలల మూసివేత దుర్మార్గం
పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు రావడం లేదనే సాకుతో రేవంత్ సర్కార్ బడులను మూసివేయడం దుర్మార్గమని ఏఐఎప్‌ఎఫ్ మండిపడింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించింది.
- ఖమ్మంలో తుమ్మల క్యాంపు కార్యాలయం ముట్టడి
- పోలీసులు, ఏఐఎస్ఎఫ్ నాయకుల మధ్య తోపులాట
- విద్యాశాఖను గాలికొదిలేసిన సీఎం రేవంత్‌రెడ్డి : రామకృష్ణ
ఖమ్మం కమాన్‌బజార్, జూన్ 7: పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు రావడం లేదనే సాకుతో రేవంత్ సర్కార్ బడులను మూసివేయడం దుర్మార్గమని ఏఐఎప్‌ఎఫ్ మండిపడింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించింది. దీంతో ఏఐఎస్ఎఫ్ నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకొని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం పలువురి ఏఐఎస్ఎఫ్ నాయకులను అరెస్టు చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ మాట్లాడుతూ.. ఒకప్పుడు వందలాదిమంది విద్యార్థులతో కళకళలాడిన పాఠశాలలు..
నేడు వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించేందుకే ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖను గాలికొదిలేశారని విమర్శించారు. విద్య హకు చట్టం ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ విద్యార్థులకు 25శాతం ఫీజురాయితీ ఇవ్వాలనే నిబంధనలు ఉన్నా, పాటించడం లేదని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, నాయకులు మాగం లోకేశ్, బుర్ర మనోజ్, పవన్, గోపి, రాము, ఉమేశ్, నరేందర్, సాయి, అభిరామ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

