KTR | సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మహారాష్ట్ర పోలీసులు వచ్చి 12 వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ను పట్టుకుంటే తెలంగాణ పోలీసులు, ఇంటెలిజెన్స్, ఈగిల్, హైడ్రాలు ఏం చేస్తున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. 12 వేల కోట్ల డ్రగ్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముడుపులు ముట్టాయా అని నిలదీశారు.
మహారాష్ట్ర పోలీసులు వచ్చి, ఇక్కడి కంపెనీలో కార్మికులుగా చేరి, నెలల తరబడి పనిచేసి అక్కడ డ్రగ్స్ తయారు చేస్తున్నారని నిర్ధారించారని కేటీఆర్ తెలిపారు. ఆ తర్వాత నీకు, పోలీసులకు సమాచారం లేకుండా 12 వేల కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుకున్నారని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా తెలంగాణ పోలీసులు, ఇంటెలిజెన్స్, ఈగిల్, హైడ్రాలు ఏం చేస్తున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. 21 నెలల నుంచి ఆ డ్రగ్స్ కంపెనీపై ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమైనా ముడుపులు ముట్టాయా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి హోంమంత్రి శాఖ, ఈగల్ టీం, హైడ్రా టీం ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. మీరంతా ముడుపులు తీసుకోవడంలో బిజీగా ఉన్నారా అని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డికి సిగ్గుందా?
మహారాష్ట్ర పోలీసులు వచ్చి నెలల తరబడి కార్మికులలా పని చేసి రూ.12 వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు
21 నెలల నుండి ఆ డ్రగ్స్ కంపెనీపై ఏం చర్యలు తీసుకోలేదంటే, రేవంత్ రెడ్డికి ఏమైన ముడుపులు అందాయా?
రేవంత్ రెడ్డి హోంమంత్రి శాఖ, ఈగల్ టీం, హైడ్రా టీం ఏం… https://t.co/S3hfupHRWj pic.twitter.com/fIIzvDyM3g
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2025
ఇంతమొత్తంలో డ్రగ్స్ దొరకడం భారతదేశంలోనే ఇది రెండో ఘటన అని కేటీఆర్ తెలిపారు. గతంలో గుజరాత్లో 21వేల డ్రగ్స్ దొరికాయని కేటీఆర్ గుర్తుచేశారు. దాని తర్వాత ఇప్పుడు హైదరాబాద్ చర్లపల్లిలో 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయని తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఇంత డ్రగ్స్ పట్టుకున్నప్పటికీ తెలంగాణ పోలీసులకు సమాచారం లేకపోవడం సిగ్గుపడాల్సిన విషయమని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి ముడుపులు అందాయేమో, అందుకే చూసి చూడనట్టు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. లేదంటే ఎవరు పోస్టులు పెడుతున్నారు.. ఎవరు రీట్వీట్లు పెడుతున్నారో చూడటం, గణేశుల దగ్గర కేసీఆర్ పాటలు పెట్టిన డీజే బాక్సులు తీసుకుపోవడంలో బిజీగా ఉన్నారేమో అని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు స్వయంగా పీసీసీ ప్రెసిడెంట్ ఓ టీవీ చర్చలో ఒప్పుకున్నాడని అన్నారు. కడియం శ్రీహరి కూడా తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఒప్పుకున్నారని తెలిపారు. నేరాంగీకారం జరిగిన తర్వాత ఇంకా విచారణ ఎందుకు అని ప్రశ్నించారు. వారిపై వేటు వేయాల్సిందే అని చెప్పారు.