బాన్సువాడ, జూన్ 1: కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి, అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ ఉమ్మ డి నిజామాబాద్ జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. రెండున్నరేండ్ల పాలనలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ‘సర్’పై అవగాహన సమావేశానికి వీజీగౌడ్, బాజిరెడ్డి, బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ పరిశీలకుడు తోట ఆగయ్య తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ సంక్షేమ పథకా లు, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ దయతోనే బాన్సువాడ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని అన్నారు.