హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీలో బీఆర్ దీటుగా బదులిచ్చేలా అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసి పెట్టుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాల్లో వాటాలు తదితర అంశాలపై ఇరిగేషన్‌శాఖ అధికారులతో ఆయన ఆదివారం కీలక సమీక్ష చేశారు. సమావేశానికి నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్, అధికారులు హాజరయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి విషయంపై జనవరి ఒకటో తేదీ సాయంత్రం లోపు స్టేటస్ ఇవ్వాలని ఆదేశించారు.