ఉప్పల్, జూలై 30: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఫిస్తా హౌజ్ చౌరస్తా నుంచి ఉప్పల్ చౌరస్తా వరకు రేవంత్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి, అక్కడే దహనం చేశారు. అనంతరం మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తీరుతో హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని విమర్శించారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోని కాంగ్రెస్ ఉనికి కోసమే పనిచేస్తున్నదని ధ్వజమెత్తారు. గ్రూపు రాజకీయాలతో తన్నుకోవడం సిగ్గుచేటని, మీడియా ప్రతినిధులపై దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కేసీఆర్‌ను విమర్శిస్తే కాంగ్రెస్ పార్టీని తరిమికొడతామని హెచ్చరించారు. ఎంపీగా నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చావో చెప్పాలని రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, బీఆర్ఎస్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, గొల్లూరి అంజయ్య, మేకల హన్మంత్‌రెడ్డి, గంధం జ్యోత్స్నానాగేశ్వర్రావు పాల్గొన్నారు.