Revanth Reddy | బెల్లంపల్లి, నవంబర్ 11: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ నోటికి అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. సీఎం కేసీఆర్‌పై పత్రికల్లో రాయడానికి వీల్లేనివిధంగా రోతభాష ఉపయోగిస్తున్నారు. రోజుకో చోట రోజుకో రీతిలో అసభ్యకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ తన అల్పబుద్ధిని చాటుకుంటున్నారు. ఇప్పటికే రైతులను బిచ్చగాళ్లని, ఓయూ విద్యార్థులను తాగుబోతులని తూలనాడిన రేవంత్.. మక్తల్, కామారెడ్డి సభల్లో కేసీఆర్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేశా రు. తన వ్యాఖ్యలను సభ్యసమాజం గర్హిస్తు న్నా, సొంత కార్యకర్తలే తప్పుబడుతున్నా అవే వీ పట్టించుకోకుండా నోటి దురుసు కొనసాగిస్తున్నారు.
శనివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సభలో కేసీఆర్‌పై అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేశారు. తన మనవడిని మంత్రిని చేసేందుకే కేసీఆర్ మూడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్నారంటూ తలతిక్కగా మాట్లాడారు. నిజానికి కేసీఆర్ మనువడు ప్రస్తుతం ఇక్కడ లేడని, చదువుకోవడానికి అమెరికా వెళ్లాడని, కనీసం ఇంకా ఓటుహక్కు కూడా రాలేదన్న స్పృహ లేకుండా అభాండా లు వేయడం, నోటి దురుసు ప్రదర్శించడం రేవంత్‌కే చెల్లింది. ఓటు హక్కే లేని పిల్లాడిని మంత్రిని చేయడం ఎలా సాధ్యమవుతుందని ఆ సభకు హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలే చర్చించుకోవడం గమనార్హం. 30న జరిగే పోలింగ్ లో ఘోర పరాజయం తప్పదన్న భయం, ఫ్రస్టేషన్‌తోనే రోజుకోరకంగా దిగజారుతూ తలతిక్క వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.