ఇచ్చోడ, ఆగస్టు 3: కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా హామీలు నెరవేర్చక ప్రజలను మోసం చేసిందని ముక్రా(కే) మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి విమర్శించారు.
ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో ‘రీకాలింగ్ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీస్- రేవంత్రెడ్డి 420 హామీల’ పేరిట కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మ్యానిఫెస్టో బుక్లెట్లను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా హామీలు అమలు చేయలేదని విమర్శించారు. మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాశ్, గ్రామస్థులు పాల్గొన్నారు.