హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు పదేళ్లు నిండాయి. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున ప్రస్తుత ముఖ్యమంత్రి నాటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి (Revanth Reddy) రూ.50 లక్షల లంచం ఇస్తూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మే, 31, 2015న తెలుగుదేశం పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి.. శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ నామిని అయిన వేం నరేందర్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే అయిన ఎల్విస్ స్టీఫెన్ సన్ కు రూ.50 లక్షల లంచం ఇస్తుండగా ఏసీబీ అరెస్ట్ చేసింది. రేవంత్ రెడ్డితో పాటు ఏసీబీ అదే రోజు మరికొందరిని అరెస్టు చేసింది. ఈనేపథ్యంలో ఓటుకు నోటుకు సంబంధించి సోషల్ మీడియాలో ఏఐ వీడియో వైరల్ అవుతున్నది.