హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
కేటీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. అన్నయ్య.. కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Annayya
Many Happy Returns of the day!! @KTRBRS— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 24, 2025
నా ప్రియమైన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. మా చిన్ననాటి అల్లరి నుంచి మీ స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణం వరకు పంచుకున్న ప్రతీక్షణం ఒక ప్రియమైన జ్ఞాపకం. మీ జ్ఞానం, మద్దతు నాకు ప్రపంచం. మీకు అపరమితమైన ఆరోగ్యం, ఆనందంతోపాటు నిరంతరం విజయం కలగాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.
Happiest Birthday to my dearest Annayya! From our childhood mischiefs to your inspiring life journey, every moment shared is a cherished memory. Your wisdom, kindness, and support mean the world to me. Wishing you boundless health, happiness, and ongoing success!… pic.twitter.com/tq3riTro7e
— Santosh Kumar J (@SantoshKumarBRS) July 24, 2025