రాష్ట్రంలో కోటి ఓట్ల తొలగింపునకు కుట్ర : రేవంత్రెడ్డి
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను అస్త్రంగా మలుచుకొని తెలంగాణలో కోటి ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతున్నదని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. సోమవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ ఉపాధ్యక్షుడు,
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను అస్త్రంగా మలుచుకొని తెలంగాణలో కోటి ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతున్నదని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. సోమవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ ఉపాధ్యక్షుడు, సీపీఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ..
ఎన్నికల్లో బీజేపీ గెలువలేనప్పుడు నరేంద్రమోదీ ప్రభుత్వం సీబీఐ,ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించిందని, ఇదేవిధంగా ఇప్పుడు ‘సర్’ను ఉపయోగించి బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. అంతకుముందు సారంపల్లి మల్లారెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్రెడ్డి నివాళులర్పించడంతోపాటు ఆయన రచించిన పుస్తకం, పాటల సీడీలను ఆవిష్కరించారు. వ్యవసాయ రంగానికి సారంపల్లి మల్లారెడ్డి అందించిన సేవలను కొనియాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

