సీఎం రేవంత్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువయ్యారు. హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి అమరవీరుల స్మారక చిహ్నానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సమయంలో ఆయన బూట్లు విడువకుండానే శ్రద్ధాంజలి ఘటించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదంటూ విరుచుకుపడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పోలీసు అమరవీరులను అవమానించేలా సీఎం వ్యవహరించిన తీరు సరికాదంటూ పలువురు మండిపడుతున్నారు.
– హైదరాబాద్