హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగా ణ): ఆదిలాబాద్ నుంచి జోగులాంబ జిల్లా దాకా సంగారెడ్డి నుంచి కొత్తగూడెం జిల్లా దాకా రైతన్నల నిరసనలతో తెలంగాణ దద్దరిల్లింది. రేవంత్ రుణ మోసంపై రణభేరి మోగించింది. పోయిన ప్రతి జిల్లాలో అక్కడి గుడిలోని దేవుడిపై ఒట్టేసి మరీ చెప్పిన మాఫీని గట్టున పెట్టిన ముఖ్యమంత్రి తీరుపై రైతులోకం భగ్గుమన్నది. ఒకే దఫాలో చేస్తానన్న రుణమాఫీని మూడు దశల కిందికి మార్చినా, ఇవాళ కాకపోతే రేపైనా అవుతుందని పంద్రాగస్టు దాకా ఓపికగా వేచిచూసిన అన్నదాతలు.. ఇది మాఫీ కాదు, మోసమని గుర్తించి ఒక్కసారిగా రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ, ఎవరికి వారుగా ముందుకు కదిలా రు. శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనాలు, ధర్నాలు, అధికారుల నిలదీతలు, ఆత్మహత్యాయత్నాలు, రాస్తారోకోలు ఇలా ఎవరికి తోచిన రూపంలో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ సర్కారు చేసిన పాపం చివరికి బ్యాంకుల మెడకు చుట్టుకున్నది. అనేక చోట్ల రైతులు బ్యాంకుల్లోకి చొరబడి మాకెందుకు రుణమాఫీ కాలేదంటూ బ్యాంకర్లను నిలదీశారు. అసలేం జరిగిందో, ఏ ప్రాతిపదికన మాఫీ చేశారో తెలియని బ్యాంకర్లు జవాబు చెప్పలేక, రైతుల్ని ఏమీ అనలేక ఆపసోపాలు పడ్డారు. అనేక చోట్ల రైతులు గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన రుణమాఫీతో ప్రస్తుత పరిస్థితిని పోల్చి మాట్లాడుకున్నారు. ఎవరు, ఏ రైతు, ఎప్పుడు, ఎంత పంట రుణం తీసుకున్నాడన్న వివరాలన్నీ బ్యాంకుల వద్ద సిద్ధంగా ఉండగా రేవంత్ ప్రభుత్వం ఇప్పటికీ సమాచారం సేకరిస్తున్నాం అంటూ సాకులు చెప్తున్నదని వారు ధ్వజమెత్తారు. ఒట్టుదీసి గట్టుమీద పెట్టి మాఫీని ఎగ్గొట్టడమే సీఎం రేవంత్ పని అంటూ తిట్టుకోవడం వినిపించింది.
రుణమాఫీ సిత్రాలు
లెక్క తప్పిందిలా..
2014 కంటే 2024 నాటికి