త్వరలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు
టీజీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు కార్మికశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ జంటనగరాల కార్మికశాఖ జాయింట్ కమిషనర్ సునీతాగోపాల్దాస్ను రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
- రిటర్నింగ్ అధికారిగా సునీతాగోపాల్దాస్
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : టీజీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు కార్మికశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ జంటనగరాల కార్మికశాఖ జాయింట్ కమిషనర్ సునీతాగోపాల్దాస్ను రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా రిటర్నింగ్ అధికారి పర్యవేక్షించనున్నారు.
నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అర్హులైన ఓటర్ల జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, భద్రతా ఏర్పాట్లు, ఓట్ల లెకింపు, ఫలితాల వెల్లడి, ఎన్నికల ప్రక్రియలో తలెత్తే వివాదాలు, సమస్యల పరిషారం వంటివన్నీ నిబంధనల ప్రకారం ఆమె పర్యవేక్షణలోనే జరుగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల పూర్తి షెడ్యూల్, పోలింగ్ కేంద్రాలు, ఓటరు అర్హత ప్రమాణాలు, ఇతర ప్రక్రియల వివరాలను రిటర్నింగ్ అధికారి త్వరలోనే విడిగా నోటిఫికేషన్ ద్వారా ప్రకటించనున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, క్రమశిక్షణతో ముగిసేలా అన్ని కార్మికసంఘాలు, ఆర్టీసీ ఉద్యోగులు, భాగస్వామ్యపక్షాలు పూర్తి సహకారం అందించాలని కార్మిక శాఖ విజ్ఞప్తి చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

