బేల, డిసెంబర్ 26 : ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన సోయా పంట నాణ్యతగా లేదంటూ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో శుక్రవారం బేల మారెట్ యార్డుకు సోయా పంట వాపస్ వచ్చింది. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు.. సుమారు 450 క్వింటాళ్ల సోయాను విక్రయించేందుకు మారెట్యార్డుకు తీసుకొచ్చారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో అధికారులు సోయాను సేకరించి మూడు లారీల్లో 220 క్వింటాళ్ల సోయాను లోడ్ చేసి ఆదిలాబాద్‌లోని మార్క్‌ఫెడ్ గోదాముకు పంపించారు. పరిశీలించిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు.. నాణ్యత సరిగా లేదని తిరసరించారు. దీంతో తిరిగి సోయా పంట బేల మారెట్‌కు వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు మారెట్యార్డ్కు వచ్చి పంటను చూసి ఆవేదన చెందారు. ప్రకృతితో నష్టం జరిగితే ప్రభుత్వం ఆదుకోకుండా ఇబ్బందులు పెడుతుందని వాపోయారు.