జోగులాంబ గద్వాల : ప్రతి సంవత్సరం తనకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి(Chief Minister Relief Fund)కి విరాళంగా(Donates) ఇవ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రశంసించారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కోయిల్దిన్నే గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ జి.కాంతా రెడ్డి(Kantha reddy) సోమవారం కలెక్టరేట్లో రెండు లక్షల రూపాయల డిమాండు డ్రాప్టును సీఎం సహాయ నిధికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు సమాజ సేవా గుణాన్ని అలవర్చుకొని సమజా హితానికి తమ వంతు సహకారం అందించాలన్నారు. సీఎంఆర్ఎఫ్కు విరాళం అందజేసిన కాంతా రెడ్డిని కలెక్టర్ అభినందించారు.