హనుమకొండ, ఫిబ్రవరి 17 : ‘కిడ్నీ సమస్యతోపాటు పక్షవాతం బారిన పడి దవాఖానలో చికిత్స పొందుతున్న.. నన్ను బతికించండి.. నా బకాయిలను వెంటనే విడుదల చేయండి’ అంటూ హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన రిటైర్డ్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జీ సమ్మిరెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని వేడుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. మంగళవారం సమ్మిరెడ్డి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం హౌస్బుజుర్గు పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచేసిన సమ్మిరెడ్డి జూన్ 2024లో రిటైర్ అయ్యారు. అప్పటినుంచి పూర్తి రిటైర్మెంట్ ప్ర యోజనాలు అందలేదు. రెండు నెల ల క్రితం కేవలం ఒక జీపీఎఫ్ మాత్ర మే విడుదలైంది. మిగతా లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ రూ.9.5 లక్షలు, గ్రా ట్యూటీ రూ.16 లక్షలు, కంటింజెన్సీ రూ. 21 లక్షలు, జీఐఎస్ తదితర బి ల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నా యి.
బకాయిలు రాకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన సమ్మిరెడ్డికి బీపీ పెరిగి పక్షవాతం వచ్చింది. దీని ప్రభావంతో రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఐదు రోజులుగా హనుమకొండలోని ప్రైవేట్ దవాఖానలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత వి షమంగా ఉన్నదని కుటుంబ సభ్యు లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. డయాలసిస్, ఔషధాలు, ఇతర వైద్య ఖర్చుల కోసం రోజుకు రూ.60 వేల వరకు ఖర్చవుతున్నదని పేర్కొన్నారు. ‘నా భర్త జీవితాంతం పిల్లలకు విద్యాబోధన చేశారు. ఇప్పుడు ఆయన ప్రాణాల కోసం పోరాడుతున్నారు. బకాయిలు వెంటనే విడుదల చేసి మా కుటుంబాన్ని కాపాడండి’ అం టూ సమ్మిరెడ్డి భార్య జ్యోతి తీవ్ర ఆవేదనతో సీఎం రేవంత్‌రెడ్డి, కలెక్టర్ స్నేహాశబరీష్ను వేడుకుంటున్నది. ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మిరెడ్డికి రావాల్సిన బకాయిలు విడుదల చేయడంతోపాటు అవసరమైన వైద్య సహాయం అందించాలని పలువురు విశ్రాంత ఉద్యోగులు, ఉద్యోగ సం ఘాల నాయకులు కోరుతున్నారు.
సమ్మిరెడ్డి ప్రాణాలు కాపాడాలి
సమ్మిరెడ్డి ప్రాణాలు కాపాడాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ రాష్ట్ర కోకన్వీనర్ ఎస్ ధర్మేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోజూ సుమారు రూ.60 వేల వరకు ఖర్చు అవుతున్నదని, ఇంత భారీ మొత్తాన్ని భరించ డం ఆ కుటుంబానికి అసాధ్యంగా మారిందని అన్నారు. బెనిఫిట్స్ రాక మానసిక వేదనతో ఇప్పటికే 65 మంది విశ్రాంత ఉద్యోగులు చనిపోయినట్టు తెలిపారు. బకాయిలను వెంటనే విడుదల చేసి సమ్మిరెడ్డి ప్రాణాలను కాపాడాలని కోరారు.