ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ ఇవ్వరా?
ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో గురువారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. కుటుంబంతో ఆనందంగా గడపాల్సిన సమయంలో బకాయిల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించిందని వారు ఆవేదన చెందారు. పెన్షనర్ల బకాయిలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
- బతుకులు ఆగమవుతున్నా పట్టించుకోరా?
- రేవా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేత ప్రభాకర్‌రావు
- పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట రిటైర్డ్ ఉద్యోగుల నిరసన
పెద్దపల్లి, అక్టోబర్ 23: ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో గురువారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. కుటుంబంతో ఆనందంగా గడపాల్సిన సమయంలో బకాయిల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించిందని వారు ఆవేదన చెందారు. పెన్షనర్ల బకాయిలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఈ సందర్భంగా ‘రేవా’ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణపొంది ఏడాదిన్నర దాటినా.. బెనిఫిట్స్ అందక రిటైర్డ్ ఉద్యోగుల బతుకులు ఆగమవుతున్నాయని అన్నారు. జీపీఎఫ్, జీఐఎస్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, కమ్యూటేషన్, గ్రాట్యూటీ అందలేదని వాపోయారు. ఉమ్మడి జిల్లా కోశాధికారి కనపర్తి దివాకర్ మాట్లాడుతూ.. బకాయిలు వచ్చేదాకా పోరాటం చేస్తామని, అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరించారు. బకాయిలు అందక ఇప్పటివరకు రాష్ట్రంలో 18 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక వేదనతో చాలామంది అనారోగ్యం బారినపడి దవాఖానల్లో ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) జల్ద అరుణశ్రీకి వినతిపత్రం అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

