హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అశాంతిని రగిల్చింది ఎవరు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల పోలీసులు, ఏఈవోలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని అని ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా నిలదీశారు. ‘ప్రశాంత రాష్ట్రంలో అశాంతిని రగిల్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాలు కాదా? రేవంత్రెడ్డి అనాలోచిత విధానాలు కాదా? డిజిటల్ సర్వే పేరుతో ఏఈవోల మీద వేటు! పనిభారంపై ప్రశ్నించినందుకు పోలీసులపై వేటు! ఇప్పుడు తెలంగాణ ప్రతి మనిషి ఆలోచిస్తున్నది. ఎట్లుండె తెలంగాణ! ఎట్లాయె తెలంగాణ!!’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.