హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని రోడ్ల నిర్మాణం, నిర్వహ ణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని ప్ర భుత్వం నిర్ణయించింది. ఇందులో భా గంగా మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి మిస్సింగ్ లింక్రోడ్ల నిర్మాణం, నిర్వహణ, అప్గ్రేడేషన్ పనులను హ్యా మ్(హైబ్రిడ్ యాన్యుటీ మోడ్)విధానం లో చేపట్టాలని సంకల్పించింది. ఈ విషయమై బు ధవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి కో మటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణం చేపట్టాలని, పనుల్లో వేగం పెంచాలని, కన్సల్టెంట్లను గుర్తించి డీపీఆర్లు సిద్ధం చే యాలని ఆదేశించారు. ఈ విధానంలో 15 ఏండ్లపాటు రోడ్ల నిర్వహణ బాధ్యత సంబంధిత కన్సల్టెంట్కే ఉండనున్నందున నాణ్యతలో రాజీపడకుండా ఇంజినీర్లు పనులను తనిఖీ చేయాలని సూచించారు. ఇప్పటి వరకు 82 నియోజకవర్గాల్లో గుర్తించిన 16 90.26 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతుల ను ప్రారంభించేలా టెండర్ల ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు.