హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : ఇంధన సంక్షోభం, పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల్లో డీజిల్ పొదుపుపై బాధ్యత పెరుగాలని సంస్థ ఎండీ వై నాగిరెడ్డి సూచించారు. శుక్రవారం ఆర్టీసీ బస్‌భవన్‌లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘డీజిల్ నిర్వహణ-అవగాహన సదస్సు’లో ఆయన మాట్లాడారు.
అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయని, ఇది ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భారాన్ని అధిగమించాలంటే డీజిల్ వృథాను అరికట్టడమే మార్గమని సూచించారు.